Post on 2024-03-22
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) జీరో కాంప్రమైజ్డ్ ఫిల్మ్ - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) జీరో కాంప్రమైజ్డ్ ఫిల్మ్ - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ - ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు.