ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమా
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించిన చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకున్నారు.
కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. "పిండం సినిమా ఏంటి అనేది మీకు డిసెంబర్ 15న తెలుస్తుంది. ఈ సినిమాని థియేటర్ లో చూడటానికి నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను." అన్నారు.
కథానాయిక ఖుషి రవి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ మంచి నటులు, మంచి దర్శకులు, మంచి నిర్మాణ సంస్థ, మంచి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయాలని కోరుకుంటాను. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. డిసెంబర్ 15న విడుదలవుతున్న మా చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.
Comments