Post on 2024-01-12
నా సామిరంగ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో పక్కా పండుగ స్పెషల్ మూవీ నా సామిరంగ అంటూ ఆ చిత్ర యూనిట్ సభ్యులు బలంగా చెబుతున్నారు. తప్పకుండా ఈ సంక్రాంతి మాదే అన్నట్లుగా వారు ధీమాతో ఉన్నారు. పండుగ వాతావరణం నా సామిరంగ సినిమాలో కనిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాలు, మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నా సామి రంగ సినిమా మొత్తంగా రూ.18.20 కోట్లు బిజనెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ కొట్టాలి అంటే రూ.20 కోట్లకు మించి వసూళ్లు చేయాల్సి ఉంది. మరి ఈ పోటీకి నా సామి రంగ అంత వసూళ్లు చేసేనా చూడాలి.