Post on 2023-11-21
The recently released songs and teaser have received an exceptional response, fueling the anticipation for the film's grand global release on December 1.
సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్
బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాతలు విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాటలు, టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. డిసెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. సుధీర్‌గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరినీ అంచనాలను మించేలా సుధీర్‌ను సరికొత్త కోణంలో ప్రెజంట్ చేసేలా కాలింగ్ సహస్ర లో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది’’ అన్నారు.