Post on 2024-02-28
'భూతద్ధం భాస్కర్ నారాయణ' అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.
సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది: ప్రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శివ కందుకూరి
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యం ప్రీరిలీజ్ ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.