Post on 2023-11-29
అథర్వ చాలా కొత్తగా ఉంటుంది.. హీరో కార్తీక్ రాజు
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. మొదటి సారిగా క్లూస్ టీం ప్రాముఖ్యతను చూపించేలా ‘అథర్వ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో హీరో కార్తీక్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే.