Post on 2023-12-08
సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్‌బీర్.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ‘యానిమల్’
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో చేరింది.
ఇక ‘యానిమల్’ వారం రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వరల్డ్‌వైడ్‌గా రూ.527 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.285కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.250 కోట్లు, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం కలిపి మొత్తంగా రూ.33 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
#Animal Explosion Continues