Ambajipeta Marriage Band

Comedy, Drama

Releasing Nov. 25, 2023

Telugu, N/A

Releasing Nov. 25, 2023

Post on 2024-02-01

అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా బిగ్ టికెట్ రిలీజ్ చేసి టీంను అభినందించిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ

సుహాస్ హీరోగా నటించిన సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా బిగ్ టికెట్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసిన విజయ్ దేవరకొండ మూవీ చాలా బాగుందంటూ ప్రశంసించారు. ఇదొక స్పెషల్ ఫిల్మ్ అని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" బిగ్ టికెట్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా ప్రమోషన్ లో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ మూవీ టీమ్ లోని ప్రతి ఒక్కరూ నాకు దగ్గర వాళ్లు. ఈ ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి ఒక స్పెషల్ మూవీ రాబోతోంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు. అని అన్నారు.

More


Start making your reels and shorts now!

Use the beautiful #MaaOoruAmbajipeta song and match it with the visuals of your wonderful hometown ... Read more

Get ready to watch the film with the team

Team of #AmbajipetaMarriageBand interact with them Today 6th February 2 PM, Bhaskar Cinemas, Gu... Read more

Grand First Single Launch Event

Team of #AmbajipetaMarriageBand from the Grand First Single Launch Event #ShekarChandra #Rahma... Read more

అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా బిగ్ టికెట్ రిలీజ్ చేసి టీంను అభినందించిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ


Post on: 2024-02-01 10:38:28

Comments


Profile Pic

×