Post on 2024-01-24
సూపర్ హిట్ సినిమాకు కావాల్సిన కంటెంట్ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"లో ఉంది
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
హీరో సుహాస్ మాట్లాడుతూ - నాకు నిన్న బాబు పుట్టాడు. ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నాను. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ. కథ విన్నప్పటి నుంచి నాతో పాటు మా టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కు డెడికేట్ అయ్యాం. రెండు సార్లు గుండు చేయించుకున్నా. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథ మీద నమ్మకంతోనే అంతగా కనెక్ట్ అయి వర్క్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీ లైఫ్ లో జరిగిన సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు
హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా మీద మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో డబుల్ ధమాకాలా మా మూవీ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను. ఇంకా 9 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. టీమ్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ హిట్ చేశారు. అలాగే సినిమాను కూడా సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లతో కలిసి థియేటర్స్ కు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.