Post on 2023-12-26
Celebrating VENKY 75
కలియుగ పాండవులు అనే సినిమాతో దగ్గుబాటి రామానాయుడు చిన్న కొడుకుగా దగ్గుబాటి వెంకటేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోని.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత ఇప్పటివరకు 75 సినిమాల్లో నటించాడు వెంకటేష్. అయితే సినిమా, లేదా క్రికెట్.. వెంకీకి ఈ రెండే ప్రపంచం. ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా హేటర్స్ ఉంటారు. కానీ, ఇండస్ట్రీ మొత్తం వెతికినా వెంకీ మామకు హేటర్స్ ను తీసుకురాలేరు. ఆయన తీసిన సినిమాలు అలాంటివి. కుటుంబ కథా చిత్రాల, కామెడీ, బంధాలు, అనుబంధాలు ఇలా ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీస్తూ.. విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇక సైంధవ్ సినిమా వెంకటేష్ 75 వ సినిమా. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి రానుంచి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేశారు మేకర్స్.