Pushpa 2: The Rule

Action, Thriller

Releasing Dec. 5, 2024

Telugu, Malayalam , Tamil , Hindi , Kannada

Releasing Dec. 5, 2024

Post on 2024-04-07

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు విడుద‌ల కానున్న‌ పుష్ప -2 ద రూల్ టీజర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు వున్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న 11:07 నిమిషాల‌కు ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ స్టిల్‌లో అల్లు అర్జున్ ఎంతో ఫెరోషియ‌స్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ సంవ‌త్స‌రం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. రేపు పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఈ సంవ‌త్స‌రం ప్ర‌త్యేక‌మైన‌దిగా చెప్పుకోవ‌చ్చు. ఈ సంవ‌త్స‌రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లొతో పాటు తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం గా నిలిచింది. అల్లు అర్జున్ తెలుగు గ‌ర్వం అని చెప్పోచ్చుమొట్ట‌ మెద‌టిసారిగా తెలుగు క‌థానాయ‌కుడు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు తీసుకోవ‌డం, మెట్ట మెద‌టిసారిగా ద‌క్షిణ భార‌తదేశ న‌టుడు దుబాయ్ లొ మ్యాడ‌మ్ టుసార్ట్ లో స్టాట్యూ క‌ల‌గ‌ట‌మే కాకుండా మెద‌టి తెలుగు న‌టుడుగా గ్యాల‌రీ ని ఏర్పాటు చేయ‌టం తెలుగు వారంద‌రికి గ‌ర్వ‌కార‌ణం. ఇలాంటి ప్ర‌త్యేక‌త‌లు ఈ సంవ‌త్సరంలో సంత‌రించుకున్నాయి.

ఇక త్వ‌ర‌లో పుష్ఫ 2 తొ మ‌రోక్క‌సారి ప్ర‌పంచం లోని సినిమా అభిమానులంతా ఒక్క‌సారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌ట‌విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నారు. 90 సంవ‌త్ప‌రాలు తెలుగు సినిమా చ‌రిత్రలొ మొద‌టిసారి తెలుగు న‌టుడి న‌ట‌న చూసేందుకు ప్ర‌పంచ దేశాల‌న్ని ఎదురుచూస్తున్నాయి.. తెలుగువారంద‌రి గౌర‌వాన్ని ప్ర‌పంచ శిఖారాన్ని తాకేలా న‌టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

More


MARK THE DATE 08-04-2024

#Pushpa2TheRuleTeaser will give you an adrenaline rush like nothing else will. #PushpaMassJaathar... Read more

#Pushpa2TheRule is a rage in the Hindi circuits 🔥🔥

Collects a Nett of 48 CRORES on Day 5 - The biggest ever non-festive Monday in Hindi 💥💥 Also races ... Read more

Pushpa 2: The Rule

#New Clip Of Pushpa Movie... Read more

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు విడుద‌ల కానున్న‌ పుష్ప -2 ద రూల్ టీజర్


Post on: 2024-04-07 19:03:18

Comments


Profile Pic

×