Post on 2023-11-22
Kota Bommali PS is not a political satire, we have shown what happens in the system: Hero Srikanth
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియా మిత్రులతో ముచ్చటించారు.
"ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్ చేజెస్ పోలీస్ కథ. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్ గా ఎలాంటి సెటైర్ ఉండదు.
దర్శకుడు తేజ ఈ సబ్జెక్టును బాగా డీల్ చేశాడు.
తను కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టనివ్వదు.
హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నేను నటించాను. దీనికోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్న. నేను రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్ గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి చూస్తారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పైఎత్తులు వేస్తూ ఉంటాను.